తెలంగాణ

telangana

ETV Bharat / sports

Controversial Tweet: ట్వీట్ చేశారు.. చిక్కుల్లో పడ్డారు - ముష్ఫీకర్ రహీమ్ కాంట్రవర్సీ ట్వీట్

ఒక్క ట్వీట్ వల్ల క్రికెటర్​పై నిషేధం పడొచ్చు. అభిమానుల ఆగ్రహానికి గురికావచ్చు. బోర్డు నుంచి హెచ్చరికలు ఉండొచ్చు. ఇలా పలువురు క్రికెటర్లు తాము చేసిన ట్వీట్ల వల్ల(Controversial Tweet) ఇబ్బందుల్లో పడిన సందర్భాలు అనేకం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

Controversial Tweets
కాంట్రవర్సీ ట్వీట్స్

By

Published : Jun 20, 2021, 5:40 PM IST

క్రికెటర్లకూ వ్యక్తిగతం జీవితం ఉంటుంది. వారూ కొన్ని విషయాల్లో అసంతృప్తి చెందొచ్చు, కామెంట్లూ, ట్వీట్లూ చేయొచ్చు. కానీ ఇది అతడికి, దేశ క్రికెట్ బోర్డుకు ఎలాంటి చెడ్డపేరు తీసుకువచ్చేలా ఉండకూడదు. వారు చేసిన ట్వీట్ కనుక ఏదైనా ఇబ్బందిని తెచ్చిపెడితే వెంటనే అతడి కెరీర్ చిక్కుల్లో పడొచ్చు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొందరు క్రికెటర్లు మాత్రం కొన్ని వివక్షపూరిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ వాళ్లెవరు? ట్వీట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

ఒల్లీ రాబిన్సన్ (Ollie Robinson)

రాబిన్​సన్

ఇంగ్లాండ్​ యువ బౌలర్​ ఒల్లీ రాబిన్​సన్ (Ollie Robinson)​ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ దేశ బోర్డు ఇటీవల నిషేధించింది. ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలపై ట్వీట్(Controversial Tweet) ఇందుకు కారణమని పేర్కొంది.​ అతడు ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ తన కెరీర్​ను గందరగోళంలో పడేసింది.

అంబటి రాయుడు (Ambati Rayudu)

రాయుడు

2019 వన్డే ప్రపంచకప్​లో రాయుడును కాదని విజయ్ శంకర్​ను ఎంపికచేసింది బీసీసీఐ. విజయ్ శంకర్ బ్యాటింగ్​, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ రాణిస్తాడని, అతడు త్రీడీ ఆటగాడని అప్పటి భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.. "ప్రపంచకప్​ను చూడటానికి త్రీడీ కళ్లజోడు ఆర్డర్​ చేశాను" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ త్రీడీ ట్వీట్ రాయుడు కెరీర్​ ముగిసేలా చేసిందని చెప్పవచ్చు. ఈ టోర్నీలో విజయ్ శంకర్ గాయపడగా.. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్​ను తీసుకుంది బోర్డు. దీనిపై అసంతృప్తితో రిటైర్మెంట్ ప్రకటించాడు రాయుడు. కానీ కొంతకాలానికే యూటర్న్ తీసుకున్నాడు.

కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen)

పీటర్సన్

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వివాదాలకు పెట్టింది పేరు. ఇతడు చాలాసార్లు తన విమర్శనాత్మక వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డాడు. 2010లో పాకిస్థాన్​ పర్యటనకు తనను ఎంపికచేయకపోవడంపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఈసీబీ సీరియస్ కావడం వల్ల వెంటనే ఆ ట్వీట్​ను డిలిట్ చేశాడు. మళ్లీ 2012లో ఇంగ్లీష్ క్రికెటర్ నిక్ నైట్​ కామెంటరీ బాక్స్​లో ఉండటాన్ని ఉద్దేశిస్తూ 'హాస్యాస్పదం' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీబీ.. భారీ జరిమానా విధించింది.

ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim)

రహీమ్

2016 ప్రపంచకప్​ హోరాహోరీ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను ఓడించింది టీమ్ఇండియా. ముస్తాఫిజుర్ రెహ్మన్​​ను చివరి బంతికి రనౌట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు ధోనీ. అయితే కొద్దిరోజులకే సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది భారత్. దీనిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు బంగ్లా క్రికెటర్ రహీమ్. "సంతోషం అంటే ఇది. హహహా. సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయింది" అంటూ చేసిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అతడిపై ట్రోల్స్ వర్షం కురిపించారు ఫ్యాన్స్. దీంతో అతడు ఆ ట్వీట్​ను తొలగించాడు.

సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)

సూర్యకుమార్

సూర్య కుమార్ వివాదాస్పద క్రికెటరే అయినా ఈ మధ్య కోపం తగ్గించుకుని కుదురుకుంటున్నాడు. 2017లో ముంబయి జట్టులో అతడికి చోటు దక్కకపోవడం వల్ల ట్వీట్​ చేస్తూ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. దానిపై తర్వాత విచారణ కోరింది ముంబయి క్రికెట్ అసోసియేషన్. సెలక్షన్​పై ప్రశ్నించే హక్కు క్రికెటర్లకు లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ సంఘటనను మరిచిపోయిన సూర్య.. కొంతకాలానికే టీమ్ఇండియాకు ఆడే స్థాయికి ఎదిగాడు.

ఇవీ చూడండి

Milkha Singh: దొంగతనం ఆలోచన నుంచి పద్మశ్రీ వరకు!

Neha Goyal: కష్టాల కడలి దాటి.. గమ్యం వైపు అడుగులేస్తూ!

ABOUT THE AUTHOR

...view details