తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ విషయంలో భిన్నంగా జరిగింది: కపిల్​దేవ్​

త్వరలోనే ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​కు టీమ్​ఇండియా మెంటార్​గా ధోనీని(Dhoni Mentor) నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడు క్రికెట్​ దిగ్గజం కపిల్​ దేవ్​. ఇది ఓ ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పాడు.

dhoni, kapil dev
ధోనీ, కపిల్ దేవ్

By

Published : Sep 11, 2021, 8:10 AM IST

టీ20 ప్రపంచకప్ కోసం​ టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీని(Dhoni Mentor) భారత జట్టు మెంటార్​గా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది బీసీసీఐ. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన క్రికెట్​ దిగ్గజం కపిల్​ దేవ్(kapil dev dhoni)​.. బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందని అన్నాడు.

"ఇది ఓ మంచి నిర్ణయం. ఓ క్రికెటర్​ రిటైర్మెంట్​ ప్రకటించాక... మూడు లేదా నాలుగేళ్ల తర్వాత మళ్లీ రావాలి. కానీ, ధోనీ విషయంలో ఇది భిన్నంగా జరిగింది. ప్రపంచకప్​ జరగనున్న నేపథ్యంలో అతడిని భారత జట్టుకు మెంటార్​గా నియమించారు. మరోవైపు రవిశాస్త్రి కూడా ప్రస్తుతం కొవిడ్​ బారిన పడ్డాడు. అందుకే ఇది ఓ ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పొచ్చు."

--కపిల్ దేవ్, మాజీ క్రికెటర్.

యూఏఈ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లోని మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ కోసం టీమ్​ఇండియా స్క్వాడ్​ను ప్రకటించింది బీసీసీఐ.

టీమ్ఇండియా స్క్వాడ్​:

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్​), కేఎల్ రాహుల్​, సూర్య కుమార్ యాదవ్​, రిషబ్​ పంత్​(వికెట్ కీపర్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్), హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్​ చాహర్​, రవిచంద్రన్​ అశ్విన్​, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, జస్ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీ.

ఇదీ చదవండి:

'శాస్త్రి, ధోనీ మధ్య భేదాభిప్రాయాలు వస్తే!'

మెంటార్​గా ధోనీ.. గంభీర్​ సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details