ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో.. భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు(Ind vs Eng 4th test 2021) జరుగుతుండగా క్రికెట్ అభిమాని డేనియల్ జర్వో(Jarvo Ind vs Eng) మరోసారి ప్రత్యక్షమయ్యాడు. వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బెయిర్‌స్టోను ఢీకొట్టాడు. అయితే.. ఈ ఘటన అనంతరం యూట్యూబర్ జార్వోను పోలీసులు అరెస్టు చేశారు.
'అనుమానాస్పద దాడి' కింద జార్వోను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇంకా దక్షిణ లండన్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచినట్లు పేర్కొన్నారు.
మ్యాచ్ మధ్యలో ఇలా అంతరాయం కలిగించే ప్రయత్నం చేయడం జర్వోకు(Jarvo cricket) మూడోసారి. అయితే.. జర్వో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు వ్యవహరించిన తీరు సరికాదని చెబుతున్నారు.