తెలంగాణ

telangana

ETV Bharat / sports

MS Dhoni: స్నేహితులతో ధోనీ.. ఫొటో వైరల్​ - ధోనీ

ఎంత బిజీగా ఉన్నా స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni). ఇటీవల ఓ దాబాలో తన మిత్రులతో కలిసి భోజనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ms dhoni,  former india cricketer
మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

By

Published : Jul 14, 2021, 12:58 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) క్రికెట్​కు వీడ్కోలు చెప్పినా.. అభిమానుల్లో అతడికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. మహీకి సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్​ మీడియాలో వైరల్​ కావల్సిందే. తాజా ఫొటో కూడా ఆ కోవలోకే వస్తుంది.

ధోనీ తన చిన్ననాటి మిత్రులతో కలిసి ఓ దాబాలో భోజనం చేస్తున్న ఓ చిత్రాన్ని ఇన్​స్టాలో షేర్ చేశాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్​ రాయిస్​ కారు కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ధోనీ ఇటీవల తన భార్యకు గిఫ్ట్​గా ఇచ్చిన కారు ఇదేనని అభిమానులు వాదిస్తున్నారు. దాని ధర కోట్లలో ఉంది.

స్నేహితులతో మహి

మహీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. అందుకే అతన్ని చాలా మంది మిత్రులు ఎక్కువగా ఇష్టపడతారు.

ఇదీ చదవండి:ధోనీ కంటే ముందొచ్చారు.. రిటైర్మెంట్​ వద్దంటున్నారు!

ABOUT THE AUTHOR

...view details