తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20Worldcup: మెగా ఈవెంట్ల ఆతిథ్యానికి పాక్​ ఆసక్తి - ఐసీసీ ఈవెంట్స్​ ఆతిథ్యమిచ్చేందుకు పాక్​ క్రికెట్​ బోర్డు

ఐసీసీ(ICC) మెగాఈవెంట్లను నిర్వహించేందుకు పాక్​​ బోర్డు(Pak Cricket board) ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం బిడ్​ దాఖలు చేసే పనిలో ఉన్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపారు.

ICC events
ఐసీసీ ఈవెంట్స్​

By

Published : Jun 12, 2021, 2:20 PM IST

టీ20 ప్రపంచకప్​, ఛాంపియన్స్​ ట్రోఫీ సహా 2024-2031 మధ్య ఐసీసీ నిర్వహించబోయే పలు మెగా ఈవెంట్ల ఆతిథ్యానికి పాక్​ క్రికెట్​ బోర్డు ఆసక్తిగా ఉన్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ఐసీసీకి సమర్పించేందుకు.. బోర్డు ప్రస్తుతం బిడ్​లు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఓ ప్రతినిధి తెలిపారు.

"ఐసీసీ తన సభ్యదేశాల నుంచి మెగా ఈవెంట్లను ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఉన్నవాళ్లు ముందుకు రావాలని కోరింది. ఈ ఏడాది డిసెంబరులో ఐసీసీ.. బోర్డుల నుంచి బిడ్​లను స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి అంతా మారిపోయింది. పాక్​ పర్యటనకు రావడానికి మిగతా జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ ఈ ఏడాది ఇక్కడకి రానున్నాయి." అని సదరు ప్రతినిధి అన్నారు.

ఇప్పటికే పాకిస్థాన్​.. సంయుక్తంగా ఐసీసీ ఈవెంట్లను నిర్వహించేందుకు ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుతో చర్చలు జరుపుతుందని వెల్లడించారు. 1996లో చివరిసారిగా భారత్​, శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ప్రపంచకప్​ను నిర్వహించింది పాక్​ క్రికెట్​ బోర్డు.

ఇదీ చూడండి: గంగూలీ నా పెళ్లికి వచ్చారు: పాక్ క్రికెటర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details