PBKS Clarity On Shashank Singh :2024 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్, శశాంక్ సింగ్ అనే ప్లేయర్‌ను పొరపాటున కొనుగోలు చేసిందన్న వార్తలపై ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. వేలంలో దక్కించుకున్న ప్లేయర్ తాను కొనుగోలు చేయాలనుకున్న ప్లేయర్ల లిస్ట్‌లో ఉన్నాడని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. 'శశాంక్ సింగ్ కొనుగోలు విషయంలో తప్పిదం జరిగిందని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది. శశాంక్ సింగ్ మేము కొనుగోలు చేయాలనుకున్న ఆటగాళ్ల లిస్ట్‌లోనే ఉన్నాడు. కానీ, లిస్ట్‌లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడం వల్ల కొంత కన్ఫ్యూజన్కు గురయ్యాం అంతే. శశాంక్ మా జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. మేము అతడ్ని స్వాగతిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాం' అని చెప్పింది.
అసలేం జరిగిందంటే? వేలం ఆఖర్లో అన్క్యాప్డ్ ప్లేయర్ల బిడ్డింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్ అనే ప్లేయర్ (బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు) బిడ్డింగ్ ప్రారంభించారు. అప్పుడే పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతా బిడ్డింగ్ వేసినట్లు సిగ్నల్ ఇచ్చారు. ఈ తర్వాత ఆమె తన ఫ్రాంచైజీ మెంబర్లతో మాట్లాడుతుంది. వెంటనే ఆక్షనీర్ మల్లిక, శశాంక్‌ను పంజాబ్ రూ. 20 లక్షలకు దక్కించుకున్నట్లు ప్రకటించింది. దీంతో అయితే వారు ఒక శశాంక్‌ను అనుకుంటే మరొక శశాంక్‌ను కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా, ఫ్రాంచైజీ 'మేము సరైన ప్లేయర్‌నే కొన్నాం' అంటూ క్లారిటీ ఇచ్చింది.