తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జరిగిన మ్యాచ్​లకే డబ్బులు చెల్లించండి' - స్టార్ ఇండియా ఛానెల్

కొవిడ్ వల్ల ఐపీఎల్​ వాయిదా పడిన నేపథ్యంలో స్టార్​ ఇండియా ఛానల్ స్పందించింది. తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలు.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లకే డబ్బులు చెల్లించాలని తెలిపింది.

ipl, Star tells worried sponsors & advertisers
ఐపీఎల్, 'ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లకే డబ్బులు చెల్లించండి'

By

Published : May 9, 2021, 2:41 PM IST

ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్‌ వాయిదా పడటం వల్ల మ్యాచ్‌ల ప్రసార హక్కులు కొనుగోలు చేసిన స్టార్‌ ఇండియా ఛానల్.. తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల వరకే డబ్బులు చెల్లించాలని కోరింది.

2018-2022 వరకు స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌.. ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను రూ.16,348 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఒక్కో మ్యాచ్‌కు రూ.54.50 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాచ్‌లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్‌ స్లాట్‌లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది.

ఈ సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రకటనకర్తలు, స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టార్‌ యాజమాన్యం.. ఆయా స్పాన్సర్లు, ప్రకటనకర్తలను ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బు చెల్లించాలని వారిని కోరింది. మిగతా వాటికి.. బీసీసీఐ తిరిగి ఎప్పుడు మిగిలిన మ్యాచ్‌లను కొనసాగిస్తుందో అప్పుడు చెల్లించాలని స్పష్టం చేసింది.

గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లుగా చేరువైందని బార్క్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయం పట్ల తాము సంతోషంగా ఉన్నా సరే.. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయటమే మంచిదని స్టార్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలనే తాము కోరుతున్నామని అన్నారు. గతవారం ఐపీఎల్‌ బయోబుడగలో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల ఈ సీజన్‌ మధ్యలోనే వాయిదా పడింది.

ఇదీ చదవండి:కొవిడ్​తో యువ క్రికెటర్​ తండ్రి మృతి

ABOUT THE AUTHOR

...view details