భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇంటర్యూ ప్రక్రియను మొదలుపెట్టింది. కోచ్ పదవి కోసం 35 మంది పోటీ పడగా.. అందులో ఇంటర్యూలకు ఎనిమిది మందిని ఎంపిక చేసింది. అందులో ప్రస్తుత కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో పాటు గతంలో మహిళల జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వర్తించి... మిథాలీ రాజ్ సహా కొందరు జట్టు సభ్యులతో విభేదాల నేపథ్యంలో పదవి నుంచి తప్పుకొన్న రమేష్ పొవార్ సైతం ఉండటం గమనార్హం.
మహిళల జట్టు కోచ్ రేసులో మళ్లీ పొవార్ - మహిళా జట్టు కోచ్ రేసులో పవార్
భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం 35 మంది పోటీ పడుతున్నారు. ఇందులో బీసీసీఐ పలువురిని ఇంటర్యూ చేసింది. గతంలో జట్టు సభ్యులతో గొడవ పడి పదవి నుంచి వైదొలిగిన రమేష్ పొవార్ కోచ్ రేసులో ఉన్నారు.
మహిళల జట్టు, భారత మహిళా క్రికెట్ జట్టు
మిగతా ఇద్దరు.. పురుష మాజీ క్రికెటర్లు అజయ్ రాత్రా, హృషికేశ్ కనిత్కర్. ఈ నలుగురికీ మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) బుధవారం ఇంటర్యూలు పూర్తి చేసింది. మమతా మాబెన్, దేవిక, హేమలత కళ, సమన్ శర్మలకు గురువారం ఇంటర్యూలు జరగనున్నాయి.