Pat Cummins Won Icc Player Of The Month :ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ 2023లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అద్భుతంగా రాణించాడు. డిసెంబర్లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0 తో క్లీన్ స్వీప్ చేయడంలోనూ ముఖ్య పాత్ర పోషించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అలా టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు.
దీంతో అతడు 2023 డిసెంబరు నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ విన్నర్‌గా నిలిచాడు. తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్్ను (న్యూజిలాండ్) వెనక్కినెట్టి మరీ కెరీర్‌లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఇంకా కమిన్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులోనూ ముందున్నాడు.
పట్టిందల్లా బంగారమే : కమిన్స్‌కు 2023 లైఫ్‌లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. గతేడాది అతడు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఎన్నో ఘనతలను సాధించాడు. అతడి కెప్టెన్సీలో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రా చేసుకుని వెనకపడిపోయింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకుంది. అనంతరం ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. తుదిపోరులో భారత జట్టును ఓడించి తొలి సారి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది. వరల్డ్ కప్‌లో రెండు ఓటములతో వెనకపడినట్లు అనిపించిన ఆసీస్‌కు వరుసగా ఏడు విజయాలు అందించి ఫైనల్‌కు చేర్చాడు. కీలకమైన తుదిపోరులో వరుసగా 10 విజయాలు సాధించి జోరు మీదున్న భారత జట్టును తన మాస్టర్ మైండ్‌తో బోల్తా కొట్టించాడు. ఆసీస్‌కు ఆరో వరల్డ్ కప్ టైటిల్‌ను సాధించాడు.
ఐపీఎల్‌లో జాక్‌పాట్ :వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన కమిన్స్ ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఫ్రాంఛైజీలు అతడి కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు దక్కించుకుంది. కమిన్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్ టీమ్‌లోకి శివమ్! - ఇక హార్దిక్ ప్లేస్‌కు ఎసరేనా?
క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఆ ఒక్క ప్రశ్న - పంత్ ఎప్పటికి వస్తాడో?