ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథిగా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను(Pat Cummins Captain) నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా. వైస్ కెప్టెన్ బాధ్యతలను స్టీవ్ స్మిత్‌కు(Steve Smith Vice Captain) అప్పగించింది.
మాజీ సారథి టిమ్ పైన్.. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు కొద్ది రోజులపాటు దూరం కానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. తోటి సహోద్యోగురాలికి అసభ్యకరంగా టెక్స్ట్ చేసిన కారణంగా టిమ్ పైన్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు.
"పాట్ కమిన్స్ ఓ అద్భుతమైన ఆటగాడు. మంచి నాయకుడు. జట్టు సభ్యుల నుంచి క్రికెట్ అభిమానుల నుంచి ఎంతో ప్రేమను సంపాదించాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్ జట్టు సీనియర్ ఆటగాళ్లలో అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉండటం చాలా గొప్ప విషయం." అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ పేర్కొన్నాడు.