టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదుర్కొంది టీమ్ఇండియా. దీంతో జట్టుపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత పేసర్ మహ్మద్ షమీ(mohammed shami news)పై కొందరు నెటిజన్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఓటమికి కారణం షమీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించారు పలువురు మాజీలు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ వ్యాఖ్యానించారు.
- "సోషల్ మీడియాలో షమీపై జరుగుతున్న దాడి ఆశ్చర్యానికి గురిచేసింది. మనమంతా షమీకి మద్దతుగా నిలబడాలి. అతడొక ఛాంపియన్. భారత జెర్సీ ధరించిన ప్రతి ఒక్కరు తమ హృదయంలో భారతీయత కలిగి ఉంటారు. తర్వాత మ్యాచ్‌లో రెచ్చిపో షమీ" అంటూ ఈ పేసర్‌కు మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
- "గతంలో భారత్.. పాక్‌పై ఓడిపోయినపుడు నన్ను పాకిస్థాన్‌కు వెళ్లమని ఎవరూ అనలేదు. గతం గురించి నేను చెబుతున్నా. ఇలాంచి చెత్త వ్యాఖ్యలు సమంజసం కాదు" అని వెల్లడించాడు ఇర్ఫాన్ పఠాన్.
- "షమీ మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ ఓ పోస్ట్ చేశాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.
-
"మేమంతా నిన్ను చూసి గర్విస్తున్నాం భయ్యా" అంటూ ట్వీట్ చేశాడు స్పిన్నర్ చాహల్.
- "ఓ భారతీయ క్రికెటర్‌గా మనమంతా షమీని చూసి గర్వపడాలి. పాక్‌పై ఓటమి తర్వాత అతడిపై విమర్శలు అనేవి బాధ కలిగించాయి" అంటూ కామెంట్ చేశాడు మాజీ పేసర్ ఆర్పీ సింగ్.