తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎవరి సాయం లేకుండానే మెట్లు ఎక్కుతూ.. త్వరలోనే టీమ్​లోకి? - rishabh pant new

Panth Health Update : రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్​ఇండియా యువ క్రికెటర్ రిషభ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా నడుస్తున్నాడు. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కిన వీడియోను తాజాగా పంత్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

panth health update
panth health update

By

Published : Jun 14, 2023, 7:27 PM IST

Updated : Jun 14, 2023, 7:33 PM IST

Panth Health Update : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమ్​ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్​ పంత్‌ వేగంగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్‌.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తన హెల్త్‌ అప్‌డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొనే పంత్.. తాజాగా మరో వీడియో పోస్టు చేశాడు.

తన ట్రైనింగ్‌ సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో పంత్‌ షేర్‌ చేశాడు. పంత్‌ ఎటువంటి సపోర్ట్‌ లేకుండా మెట్లు ఎ‍క్కుతుండడం ఈ వీడియోలో కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో తొలుత పంత్‌ కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. కాగా ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా పంత్‌ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌, ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్‌ దూరమయ్యాడు. రిషబ్‌ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్​నకు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.

రిషభ్​ పంత్ గతేడాది డిసెంబర్‌ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తల్లికి సర్​ప్రైజ్​ ఇద్దామని దిల్లీ నుంచి లఖ్​నవూకు వెళ్తున్న సమయంలో రూర్కీ సమీపంలో అతడి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం పంత్‌ కోలుకుంటున్నాడు..

ఆ జట్టులో పంత్​కు చోటు!
WTC Final 2023 Rishabh Pant : ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే.. బ్యాటింగ్‌లో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్ పుజారాలలో ఒక్కరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. స్పిన్‌, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు కల్పించింది. రిషభ్‌ పంత్​ను వికెట్ కీపర్‌గా ఎంచుకుంది.

టాప్​-10లో ఒకే ఒక్కడు..
ఐసీసీ తాజాగా టెస్ట్​ర్యాంకింగ్స్​ విడుదల చేసింది. బ్యాటర్ల విభాగంలో రిషభ్‌ పంత్ (758) మాత్రమే పదో స్థానంతో టాప్‌-10లో ఉన్నాడు. రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్‌కు దిగజారిపోయారు.

Last Updated : Jun 14, 2023, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details