ఇటీవలే టెస్ట్ సిరీస్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ తిని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఆ వెంటనే మళ్లీ.. అతడు ఏకంగా సహచర క్రికెటర్ ప్రేయసికి బాబర్ లైంగిక సందేశాలు పంపించాడంటూ వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. బాబర్ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సహా లైంగిక సందేశాలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అవి నిరాధారణమైనవని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ విషయమై కెప్టెన్ బాబార్ కూడా స్పందించాడు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో లీకైన వీడియోలో బాబర్ ఆజామ్ "నువ్వు (అమ్మాయి) ఇలాగే నాతో సెక్స్ చాటింగ్ చేస్తుంటే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటకు వెళ్లడు" అని ఆ అమ్మాయికి బాబర్ హామీ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదంతా దుష్ప్రచారం అని, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవని బాబర్ అభిమానులు అంటున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ల్లో దారుణ ఓటముల తర్వాత బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే న్యూజిలాండ్‌తో కూడా వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌కు త్వరలోనే షాన్ మసూద్‌ను టెస్టులు, వన్డేలకు సారథిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బాబర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు అతడిపై చేస్తున్న కుట్ర అని అంటున్నారు.