pak captain babar azam record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 93 బంతుల్లో 77 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో బాబర్‌కు ఇది వరుసగా 9వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు కావడం విశేషం. గతంలో ఏ ఇతర బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డు ఇది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 196 రన్స్ చేయడంతో బాబర్ ఫిఫ్టీ ప్లస్ స్కోరు పరంపర మొదలైంది. ఆ తర్వాత మూడు, నాలుగో టెస్టు మ్యాచ్‌ల్లో వరుసగా 66,55.. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో 57,114,105*, ఓ టీ20 మ్యాచ్‌లో 66 స్కోర్లలో ఆ సిరీస్ ముగించాడు. ఇక ఇప్పుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో సెంచరీ, 77 రన్స్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే వన్డేల్లో కెప్టెన్‌గా కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి రన్స్ చేసిన అరుదైన ఘనతను బాబర్ సొంతం చేసుకున్నాడు. కాగా, కోహ్లీకి ఈ ఫీట్ అందుకోవడానికి 17 ఇన్నింగ్స్ పట్టడం గమనార్హం.
Imam ul haq run out: మరోవైపు ఈ రెండో మ్యాచ్‌లో మిస్‌కమ్యూనికేషన్ ద్వారా ఓ తప్పిదం జరిగింది. కెప్టెన్ బాబర్ చేసిన చిన్న పొరపాటు వల్ల పాక్ జట్టులోని మరో ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఇమామ్ బ్యాట్‌ను నేలకేసి బాది కోపంగా మైదానం నుంచి బయటకు వెళ్లాడు.