తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్ బౌలర్ సూపర్ రికార్డ్​.. అరంగేట్ర మ్యాచ్​లోనే ఏడు వికెట్లు - పాకిస్థాన్​ లెగ్​ స్పిన్నర్​ అబ్రార్​ రికార్డ్​

అరంగేట్రంలోనే అదిరే ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు పాకిస్థాన్​ లెగ్​ స్పిన్నర్​ అబ్రార్​ అహ్మద్​. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు ఏకంగా ఏడు వికెట్లతో అదరగొట్టాడు.

Pakisthan bowler record
పాకిస్థాన్ బౌలర్ సూపర్ రికార్డ్​.. అరంగేట్ర మ్యాచ్​లోనే ఏడు వికెట్లు

By

Published : Dec 9, 2022, 4:41 PM IST

అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు పాకిస్థాన్​ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేసిన ఈ యువ బౌలర్‌ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో ట్విటర్‌ వేదికగా అబ్రార్‌ అహ్మద్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అబ్రార్‌ అహ్మద్‌ ఏడు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌తో పాటు జహీద్‌ మహ్మద్‌ కూడా మూడు వికెట్లు సాధించాడు. కాగా మొత్తం పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. ఇక ఇంగ్లీష్​ బ్యాటర్లలో డాకెట్‌ (63), ఓలీ పాప్‌(60) పరుగులతో రాణించారు. ఇక ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

తొలి పాక్‌ బౌలర్‌గా.. టెస్టు అరంగేట్రం తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన తొలి పాక్‌ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్‌ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్‌ పేసర్‌ వహబ్‌ రియాజ్‌ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన 13వ పాకిస్థాన్​ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

ఇదీ చూడండి:IPL: ఐంపాక్ట్​ ప్లేయర్​ రూల్​లో మార్పులు​.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన బీసీసీఐ!

ABOUT THE AUTHOR

...view details