Mohammed Hafeez Retirement: రెండు దశాబ్దాలుగా పాకిస్థాన్ క్రికెట్‌కు సేవలందించిన స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. 2018లో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. తాజాగా వన్డేలు, టీ20ల నుంచి తప్పుకొన్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కరీబియన్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, దుబాయ్ టీ10 లీగ్‌లో భాగమయ్యాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ - మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్
Mohammed Hafeez Retirement: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
మహ్మద్ హఫీజ్
మహ్మద్ హఫీజ్.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. చివరి మ్యాచ్‌ను 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. కెరీర్లో 55 టెస్టులు(3652 పరుగులు, 53 వికెట్లు), 218 వన్డేలు(6614, 139), 119 టీ20(2514, 61), 8 ఐపీఎల్(64 రన్స్) మ్యాచ్‌ల్లో పాలుపంచుకున్నాడు .
ఇదీ చూడండి: కెప్టెన్సీపై ఆశలేదు.. అతడి సారథ్యంలోనే అడతా: స్టోక్స్
Last Updated : Jan 3, 2022, 12:19 PM IST