తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రోటీస్​పై పాక్ గెలుపు- టీ20 సిరీస్ కైవసం‌ - pakistan win t20 series

దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టీ20ని పాకిస్థాన్​ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో పొట్టి సిరీస్​ను 3-1తో కైవసం చేసుకుంది పాక్. వన్డే సిరీస్​ను​ కూడా 2-1 తేడాతో బాబర్​ సేన గెలుపొందింది.

Pakistan vs South Africa, Pakistan wins T20 series
పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా, టీ20 సిరీస్

By

Published : Apr 17, 2021, 7:19 AM IST

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న పాకిస్థాన్‌.. టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌ను 3 వికెట్లతో నెగ్గిన పాక్‌ సిరీస్‌ను 3-1తో నెగ్గింది. శుక్రవారం ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదట 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది.

వాండర్‌ డసెన్‌ (52), మలన్‌ (33) మినహా అంతా విఫలమయ్యారు. లక్ష్యాన్ని పాక్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫకార్‌ జమాన్‌ (60; 34 బంతుల్లో 5×4, 4×6) రాణించాడు. వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1తో నెగ్గింది.

ABOUT THE AUTHOR

...view details