Pakistan Vs South Africa World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ అందరినీ నిరాశపరుస్తోంది పాకిస్థాన్ జట్టు. ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత వేగం పుంజుకుందనుకంటే అది జరగలేదు. దక్షిణాఫ్రికాతో తాజాగా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినప్పటికీ పాక్ జట్టు విజయ తీరాలకు చేరలేకపోయింది. దీంతో మిగిలిన మూడు మ్యాచులను గెలిచినా కూడా సెమీస్‌కు చేరుతుందనే నమ్మకం లేకుండా పోయింది.
దక్షిణాఫ్రికాపై ఓ దశలో ఓటమి ఖాయమైనప్పటికీ.. పాక్ పుంజుకుని మరీ అద్భుతంగా పోరాడింది. అయితే ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. అయితే.. చివరి వికెట్ విషయంలో అంపైర్ నిర్ణయం పాక్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో (45.6వ ఓవర్) చివరి బ్యాటర్ కేశవ్ మహరాజ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీగా పాక్ అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. పాక్ డీఆర్‌ఎస్‌కు వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడా చివరికి 'అంపైర్స్ కాల్' రావడం వల్ల కేశవ్ బతికిపోయాడు. లేకుంటే పాకిస్థాన్ విజయం సాధించేది.
ఇలా 'అంపైర్స్ కాల్' నిర్ణయం కాస్త కాంట్రవర్సీగా మారింది. డెసిషన్ తమకు అనుకూలంగా వస్తుందంటే కానీ వచ్చిన ఫలితం పట్ల పాక్ నిరాశకు గురైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందించాడు.
"మ్యాచ్‌లో గెలుపునకు దగ్గరగా వచ్చాం. కానీ, ఫినిష్ సరిగా చేయలేదు. ఈ ఓటమి మా జట్టును తీవ్ర నిరాశకు గురి చేసింది. బ్యాటింగ్‌లో 15 పరుగులు తక్కువగా చేశాం. కానీ, బౌలర్లు పుంజుకున్న తీరు మాత్రం అద్భుతం. కానీ, వారి పోరాటం ఏ మాత్రం సరిపోలేదు. దురదృష్టవశాత్తూ అంపైరింగ్ నిర్ణయాలు మాకు అనుకూలంగా రాలేదు. అయితే, ఇవన్నీ గేమ్‌లో భాగమే. డీఆర్‌ఎస్ తీసుకున్నా కూడా ఫలితం అనుకూలంగా మారలేదు. ఒకవేళ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే మాకు ఫేవర్‌గానే వచ్చేది. కానీ, అలా జరగలేదు. ఈ మ్యాచ్‌లో మేము గెలిచి ఉంటే సెమీస్ రేసులో ఉండేవాళ్లం. ఆ తర్వాతి మూడు మ్యాచుల్లోనూ మావంతు ప్రయత్నం చేసి విజయం సాధిస్తాం. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే మేం ఏ స్థానంలో ఉన్నామనేది తెలుస్తుంది" అని బాబర్ అన్నాడు.
మరోవైపు పాకిస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో పరాజయం. అంతకుముందు భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌పై ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. రెండు విజయాలు, నాలుగు ఓటములతో పాక్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో (అక్టోబర్ 31న), న్యూజిలాండ్‌తో (నవంబర్ 4న), ఇంగ్లాండ్‌తో (నవంబర్ 11న) పాక్ తలపడాల్సి ఉంది.
PAK VS SA World Cup 2023 : నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం
Special Security To Babar Azam : పాక్ కెప్టెన్ బాబర్‌కు బంగాల్లో స్పెషల్ సెక్యురిటీ.. ఎందుకో తెలుసా?