తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో పాక్​పై ఇంగ్లండ్​ గెలుపు - ఇంగ్లండ్

సౌతాంప్టన్​ వేదికగా పాక్​తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్​ బ్యాట్స్​మెన్​ బట్లర్ శతకంతో చెలరేగగా...రాయ్, మోర్గాన్​లు ఆకట్టుకున్నారు. 55 బంతులకు 110 పరుగులు చేసిన బట్లర్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కింది. పాక్​ ఆటగాడు ఫఖార్ జమాన్ శతకం వృథా అయింది.

ఇంగ్లండ్​

By

Published : May 12, 2019, 12:21 AM IST

Updated : May 12, 2019, 12:29 AM IST

పాకిస్థాన్​తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్​లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిందీ మ్యాచ్​.టాస్ ఓడిమొదట బ్యాటింగ్​ చేసిన ఇంగ్లండ్​ బ్యాట్స్​మెన్​ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ముఖ్యంగా జాస్​ బట్లర్​ దూకుడుగా ఆడి 55 బంతుల్లో 110 పరుగులు బాదాడు. జేసన్​ రాయ్(87), బెయిర్ స్టో(51), మోర్గాన్(71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పాకిస్థాన్​ చివరి వరకు వచ్చి ఓటమి పాలైంది. ఫఖార్ జమాన్(138) శతకం వృథా అయింది. ఇంగ్లీషు బౌలర్లలో వోక్స్, ప్లంకెట్ చెరో వికెట్ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది పాకిస్థాన్. ఓపెనర్లు ఇమామ్​ ఉల్ హఖ్(35) - ఫఖార్ జోడి తొలి వికెట్​కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అనంతరం బాబర్ ఆజమ్(51), అసిఫ్ అలీ(51) అర్ధశతకాలతో అదరగొట్టినా.. జట్టును గెలిపించలేకపోయారు. 50 ఓవర్లలో 361 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది పాకిస్థాన్.

అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన ఇంగ్లీషు బ్యాట్స్​మెన్​ పాక్ బౌలర్లుకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బట్లర్ 55 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదీ, హసన్ అలీ, సోహైల్ తలో వికెట్ తీసుకున్నారు.

Last Updated : May 12, 2019, 12:29 AM IST

ABOUT THE AUTHOR

...view details