తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​లోనే ఆసియా కప్​.. భారత్​ మ్యాచ్​లు మాత్రం విదేశాల్లోనే! - asia cup 2023 india matches

సుమారు ఆరు నెలల కాలంగా చర్చనీయాంశమైన ఆసియా కప్-2023 నిర్వహణకు సంబంధించి ప్లాన్​ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లను యూఏఈ వేదిక‌గా నిర్వహించాలని, మిగితా మ్యాచ్‌లను పాక్‌లోనే జరపాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

Asia Cup 2023
Asia Cup 2023

By

Published : Mar 24, 2023, 8:07 AM IST

Updated : Mar 24, 2023, 8:19 AM IST

Asia Cup 2023: ఆసియా కప్- 2023 నిర్వహణ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్​ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా.. దాయాది దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ అంగీక‌రించ‌డం లేదు. కొద్దిరోజుల క్రితం ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను బీసీసీఐ సూచించింది. అయితే టీమ్​ఇండియా- పాకిస్థాన్​ మ్యాచ్​లు.. అటు భారత్​, ఇటు పాక్​ కాకుండా విదేశాల్లో ఏసీసీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ వేదిక‌గా నిర్వహించాలని ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

మోదీ సర్​తో మాట్లాడుతా!
ఇటీవలే ఈ వివాదంపై పాకిస్థాన్​ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని సృష్టం చేశాడు. అదే విధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను త్వరలోనే మాట్లాడుతానని చెప్పాడు.

"భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు, ఇతర టోర్నీలు జరగాలి. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోదీ సార్​ను అభ్యర్థిస్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము. బీసీసీఐ చాలా బలమైన క్రికెట్‌ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు. మీకు సంభందాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు. ఇక పాక్​ క్రికెట్‌ బోర్డు బలహీనంగా ఏమీ లేదు. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్​ ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంది. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అఫ్రిది పేర్కొన్నాడు.

ఒకే గ్రూప్​లో భారత్​, పాక్​..
సెప్టెంబరు మొదటి వారంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ ఏడాది ఆసియా కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​లు రెండో గ్రూప్‌లో ఉన్నాయి. ఫైనల్‌తో కలిపి 13 రోజుల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2022 ఆసియా కప్ ఫార్మాట్ ప్రకారం.. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కు చేరుకుని ఫైనల్‌లో పోటీపడతాయి. అయితే టోర్నీ మొత్తంలో భారత్‌, పాకిస్థాన్‌లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.

Last Updated : Mar 24, 2023, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details