Pakistan Team Visa Issue :2023 ప్రపంచకప్‌నకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ ప్లేయర్లకు సోమవారం వీసా సమస్య క్లియర్ అయ్యింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే వీసా మంజూరు విషయంలో ఆలస్యం అవుతుండడం పట్ల.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఐసీసీకి లేక రాసిన తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది. దీంతో యథావిధిగా పాక్ జట్టు ప్లేయర్లు, సిబ్బంది సెప్టెంబర్ 27న హైదరాబాద్ రానున్నారు.
అంతకుముందుఐసీసీ సీఈఓ జియోఫ్ అల్లార్డిస్కు పీసీబీ ఓ లేఖ రాసింది. అందులో తమ జట్టు ప్లేయర్లకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, అభిమానులకు వీసా మంజూరు విషయంలో తాము వ్యక్తం చేసిన ఆందోళలను మూడేళ్లుగా పరిష్కరించలేదని తెలిపింది. పాకిస్థాన్‌తో ఇలాంటి అవమానకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పింది.
ICC World Cup 2023 :ఇదే విషయాన్ని పీసీబీ ప్రతినిధి ఉమర్ ఫరూక్ పునరుద్ఘాటించారు. వరల్డ్ కప్ 2023 కోసం సెక్యూరిటీ క్లియరెన్స్, భారత్ వీసా పొందడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. గత వారం నుంచి 24 గంటల్లో వీసాలు మంజూరువుతాయని అంటున్నా.. ఇంకా వేచి చూడాల్సి వస్తోందని తెలిపారి. భారత్ హోం శాఖ ఇంకా ఎన్ఓసీ మంజూరు చేయలేదని వెల్లడించారు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నమెంట్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు వీసా విషయంలో అనిశ్చితి నెలకొనడం నిరాశ కలిగించే విషయమని అన్నారు. తాము రీ-షెడ్యూల్ రూపొందించాలని.. వీసా జారీకి అనుగుణంగా విమానాలు బుక్ చేసుకోవాలని ఉమర్ ఫరూక్ ఆందోళన వ్యక్తం చేశారు.