క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీని యూఏఈ, ఒమన్ దేశాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI News) నిర్వహించనుంది. మరో వారం రోజుల్లో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్(England Cricket News) ఇప్పటికే ఒమన్ చేరుకోగా.. మిగిలిన దేశాల క్రికెట్ జట్లు యూఏఈ పయనానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జట్లన్నీ తమ కిట్లతో పాటు కొత్త జెర్సీలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది.
భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అక్కసు! - pakistan jersey
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై(PCB News) క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌నకు(ICC T20 World Cup 2021) సంబంధించిన జెర్సీపై.. టోర్నీ నిర్వహిస్తున్న భారత్ పేరుకు బదులు.. యూఈఏ అని పేరు మార్చడం వల్ల పీసీబీ వక్రబుద్ధిపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021ను భారతదేశంలో నిర్వహించాల్సింది. కానీ, భారత్‌లో కొవిడ్ సంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, ఒమన్ వేదికల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పాల్గొనే జట్లు అన్నీ 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021' అనే లోగో ఉన్న జెర్సీలను ధరించాల్సి ఉంది. పీసీబీ మాత్రం అందుకు భిన్నంగా టోర్నీని యూఏఈ పేరుతో(ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈ 2021) ఉన్న జెర్సీలతో(PCB Jersey) ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారడం వల్ల పీసీబీపై పలువురు క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు జెర్సీపై మాత్రం ఇండియా నిర్వహిస్తున్నట్లు ఉంది. దీంతో పీసీబీపై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.
ఇదీ చూడండి..వచ్చే సీజన్లో ఆడొచ్చు.. ఆడకపోవచ్చు: ధోనీ