ICC ODI Team Rankings: ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియాను అధిగమించింది పాకిస్థాన్. ఇటీవలే ముల్తాన్‌లో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన దాయాదీ జట్టు.. తాజా ర్యాంకింగ్స్‌లో నెం.4కు చేరింది. దీంతో భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది.
వెస్టిండీస్‌తో సిరీస్ ఆరంభానికి ముందు 102 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది పాక్. అయితే 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా 106 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. దీంతో 105 పాయింట్లతో ఉన్న భారత్.. ఐదుకు పడిపోయింది.