Pakistan Squad For World Cup 2023 :2023 ప్రపంచకప్‌నకు దాయాది జట్టు పాకిస్థాన్.. 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. వీరితో పాటు మరో ముగ్గురిని రిజర్వ్డ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది పార్ మేనేజ్మెంట్. ఇక ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు లాహోర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్.. సభ్యుల వివరాలను వెల్లడించారు.
వరల్డ్‌కప్‌నకు పాకిస్థాన్ జట్టు..బాబర్ అజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్ షఫిక్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘ, మహమ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ, మహమ్మద్ వసీమ్. రిజర్వ్ ప్లేయర్లు..మహమ్మద్ హారిస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్
గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్.. మెగాటోర్నీకి ముందు పాక్‌కు పెద్ద షాక్ తగిలింది. గాయం కారణంగా పేసర్ నజీమ్ షా పూర్తి టోర్నీకి దూరమయ్యాడు. ఆసియా కప్ మధ్యలో గాయపడిన ఇమామ్ ఉల్ హక్, హారిస్ రౌఫ్.. ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ జట్టులో మార్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకూ అన్ని దేశాలకు ఐసీసీ వెసులుబాటు కల్పించింది. మరి పాక్.. ఏవైనా మార్పులు చేస్తుందా లేదా ఇదే జట్టుతో బరిలోకి దిగనుందా అనేది వేచి చూడాలి. ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్థాన్ తమ మొదటి మ్యాచ్ ఆక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.