తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మా లెక్కలు మాకున్నాయి, అతడు ఉంటే కచ్చితంగా సెమీస్​కు చేరతాం!': బాబర్ - fakhar zaman world cup century

Pakistan Semi Final Scenario : 2023 వరల్డ్​కప్​లో సెమీస్ చేరేందుకు పాకిస్థాన్​కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. కానీ, పాక్.. తమ చివరి మ్యాచ్​లో అసాధారణ రీతిలో ఇంగ్లాండ్​పై నెగ్గాలి. ఈ నేపథ్యంలో ప్రెస్​మీట్​లో పాల్గొన్న బాబర్ అజామ్.. తాము సెమీస్​కు అర్హత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

Pakistan Semi Final Scenario
Pakistan Semi Final Scenario

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 5:02 PM IST

Updated : Nov 10, 2023, 5:25 PM IST

Pakistan Semi Final Scenario:2023 ప్రపంచకప్​ లీగ్ మ్యాచ్​లు చివరి దశకు చేరుకున్నాయి. సెమీస్​కు ముందు మరో 3 మ్యాచ్​లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్​కు చేరుకున్నాయి. మిగిలిన చివరి బెర్త్​ను న్యూజిలాండ్.. దాదాపు దక్కించుకున్నట్లే. కానీ కివీస్ సెమీస్ చేరాలంటే.. పాకిస్థాన్ చివరి మ్యాచ్ ఫలితం వరకు ఆగాల్సిందే.

అయితే పాక్.. సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్​లో భారీ తేడాతో ఇంగ్లాండ్​ను ఓడించాలి. పాయింట్ల పట్టికలో కివీస్ (+0.743) రన్​రేట్​తో నాలుగో స్థానంలో ఉండగా.. పాక్ (+0.036) రన్​రేట్​తో ఐదో స్థానంలో ఉంది. ఈ లెక్కన పాక్, కివీస్ రన్​రేట్​ను అధిగమించాలంటే.. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో నెగ్గాలి. ఒకవేళ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్​కు దిగితే.. ఆ జట్టుని 150 పరుగుల లోపు కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలో ఛేదించాలి.

ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. శుక్రవారం ప్రెస్​మీట్​లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో తమ జట్టు సెమీస్ అర్హత సాధిస్తుందని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. "మేము ఇంగ్లాండ్​తో ఆడబోయే మ్యాచ్​లో న్యూజిలాండ్ నెట్​ రన్​రేట్​ను అధిగమించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మా బ్యాటర్ ఫకర్ జమాన్ 20 - 30 ఓవర్ల దాకా క్రీజులో ఉంటే.. మేం భారీ స్కోర్ సాధిస్తాం" అని బాబర్ అన్నాడు.

బాబర్ ధీమాకు ఆ ఇన్నింగ్సే కారణం!పాక్ తమ చివరి మ్యాచ్​లో న్యూజిలాండ్​ను ఢీకొట్టింది. ఈ మ్యాచ్​లో పాక్.. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 402 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్​ ముందుంచింది. దీంతో పాక్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. కానీ, పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్.. ప్రారంభం నుంచే తుఫాన్ ఇన్నింగ్స్​తో చెలరేగాడు. అతడు 81 బంతుల్లోనే 126 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో కూడా జమాన్ ఇదే విధంగా.. విధ్వంసం సృష్టిస్తాడన్న నమ్మకంతోనే బాబర్ అలా అన్నాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

బైబై పాకిస్థాన్.. అయితే ఈ సమీకరణాల ప్రకారం పాక్.. సెమీస్​కు చేరడం అసాధ్యమైన పని. దీంతో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.. సోషల్ మీడియా వేదికగా పాక్‌ను వ్యంగ్యంగా ట్రోల్ చేశాడు. " పాకిస్థాన్ పరిగెత్తండి. మీ జర్నీ ఇక్కడి వరకే. మా ఆతిథ్యం, బిర్యానీ మీరు ఆస్వాదించారని అనుకుంటున్నాను. క్షేమంగా ఇంటికి వెళ్లండి. బైబై పాకిస్థాన్‌" అని ఇన్‌స్టాగ్రామ్‌లో సెహ్వాగ్ పోస్ట్​ చేశాడు.

సెమీస్​లో నాలుగో బెర్త్ కివీస్​దే! - పాకిస్థాన్​ రెస్​లో ఉండాలంటే?

నాకౌట్ మ్యాచ్​ల టికెట్ల సేల్ అప్పుడే - గెట్ ​రెడీ క్రికెట్ ఫ్యాన్స్​

Last Updated : Nov 10, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details