Asif Ali fight with Fareed Malik : ఆసియా కప్‌లో భాగంగా బుధవారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీల్డ్‌లో ప్లేయర్స్ అదుపు తప్పగా స్టాండ్స్‌లోని అభిమానులు రెచ్చిపోయారు. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చివరికి పాకిస్థాన్ ఒక్క వికెట్‌తో గెలిచి ఫైనల్‌కు చేరింది.
అయితే అంతకుముందు పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీని ఔట్ చేసిన ఆనందంలో అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ కాస్త ఎక్కువగానే సంబరాలు చేసుకున్నాడు. ఆసిఫ్ అలీ ముందుకు వెళ్లి విజయనాదం చేశాడు. ఆగ్రహించిన ఆసిఫ్ అదుపు తప్పాడు. ఒక్కసారిగా ఫరీద్‌ను వెనక్కి నెట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడం వల్ల ఆసిఫ్ ఈ సారి ఫరీద్‌ను ఏకంగా బ్యాట్‌తోనే కొట్టబోయాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా మిగతా అఫ్గాన్ ప్లేయర్లు,అంపైర్లు వచ్చి వారిద్దరిని సముదాయించారు. ఆ తర్వాత ఆసిఫ్ అలీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.