Pakistan pacer Hasnain suspension: పాకిస్థాన్ యువ పేసర్ మొహమ్మద్ హస్నైన్ను అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా నిషేధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం తెలిపింది.
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీంతో లాహోర్‌లో అతనికి బౌలింగ్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అక్రమ బౌలింగ్ వేస్తున్నాడని తేలడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ.