తెలంగాణ

telangana

సెంచరీతో 'స్టోన్' రెచ్చిపోయినా.. పాక్​దే విజయం

By

Published : Jul 17, 2021, 11:07 AM IST

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది పాకిస్థాన్​. తొలి టీ-20లో ఘనవిజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్​లో పర్యటక జట్టుదే పైచేయి. లివింగ్​స్టోన్​ ఇంగ్లాండ్​ తరఫున ఫాస్టెస్ట్​ సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. మరోవైపు.. చివరి టీ-20లో ఆసీస్​పై గెలిచింది వెస్టిండీస్​.

living stone
లివింగ్​ స్టోన్​

లియామ్​ లివింగ్​ స్టోన్​.. ఇంగ్లాండ్​ తరఫున ఫాస్టెస్ట్​ సెంచరీ చేసినా ఆ జట్టును గెలిపించలేకపోయాడు. పాకిస్థాన్​తో.. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్​లో 31 పరుగుల తేడాతో ఓడింది ఆతిథ్య జట్టు. లివింగ్​ స్టోన్​ 42 బంతుల్లోనే శతకం సాధించాడు.

తొలుత బ్యాటింగ్​ చేసిన పాక్​ 20 ఓవర్లలో 6 వికెట్లకు.. 232 పరుగులు చేసింది. ఓపెనర్లు రిజ్వాన్​(63), బాబర్​ అజామ్​(85) చెలరేగారు.

ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ 19.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. లివింగ్​ స్టోన్​ (103, 9x6, 6x4), జాసన్​ రాయ్​(13 బంతుల్లో 32) తప్ప ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. షాహీన్​ అఫ్రిదీ, షాదాబ్​ ఖాన్​ చెరో 3 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్​లో మొత్తం 27 సిక్సర్లు( పాక్​ 12, ఇంగ్లాండ్​ 15) నమోదయ్యాయి.

3 మ్యాచ్​ల వన్డే సిరీస్​ను ఇప్పటికే ఇంగ్లాండ్​.. క్లీన్​స్వీప్​ చేసింది​.

విండీస్​ సిరీస్​ విజయం(Australia Vs Westindies)

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో విజయం సాధించింది వెస్టిండీస్​. 16 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్​ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. వెస్టిండీస్​ బౌలర్​ హేడెన్​ వాల్ష్​ ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు.

సంక్షిప్ల స్కోర్లు:

వెస్టిండీస్​​-199/8 (20 ఓవర్లు), లూయిస్​ (79, 9x6, 4x4), పూరన్​(31)​​. ఆండ్రూ టై 3, మిచెల్​ మార్ష్​ 2 వికెట్లు

ఆస్ట్రేలియా-183/9(20ఓవర్లు), ఆరోన్​ ఫించ్​(34), మిచెల్​ మార్ష్​(30). కాట్రెల్ 3, రసెల్​ 3 వికెట్లు

సిరీస్​ సమం (Ireland Vs South Africa)

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. శుక్రవారం ఆఖరిదైన మూడో వన్డేలో సఫారీ జట్టు 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జానేమన్​ మలన్‌ (177 నాటౌట్‌), డికాక్‌ (120) భారీ శతకాలతో చెలరేగారు. ఛేదనలో ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎనిమిదో స్థానంలో వచ్చిన సిమి సింగ్‌ (100 నాటౌట్‌) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశాడు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details