తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్ కోచ్​కు కరోనా.. 10రోజులు క్వారంటైన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ కరోనా బారిన పడ్డాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆ జట్టు తిరిగి పాక్​కు ప్రయాణం కాగా.. 10 రోజుల క్వారంటైన్ అనంతరం మిస్బా పాకిస్థాన్ వెళ్లనున్నాడు.

మిస్బా
మిస్బా

By

Published : Aug 25, 2021, 9:54 PM IST

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్​కు కొవిడ్ సోకింది. దీనితో ఆయన 10 రోజుల పాటు వెస్టిండీస్​లో క్వారంటైన్​లో ఉండనున్నాడు. లక్షణాలు లేకుండానే మిస్బా కరోనా బారిన పడినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. రెండుసార్లు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మిస్బా విఫలమైనట్లు వెల్లడించింది. దీనితో మిగిలిన జట్టు సభ్యులు లాహోర్‌ తిరిగి వచ్చారని తెలిపింది.

మిస్బా బాగోగులు చూసుకునేందుకు వెస్టిండీస్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని.. ప్రత్యేక వైద్యుడిని ఏర్పాటు చేస్తామని పీసీబీ క్రికెట్ తెలిపింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ని పాకిస్థాన్ 1-1తో డ్రాగా ముగించింది. నాలుగు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను పాక్ 1-0తో గెలుచుకుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details