తెలంగాణ

telangana

ETV Bharat / sports

Pakistan Cricketers Salary : 5 నెలలుగా పాక్ ప్లేయర్లకు నో శాలరీ.. అందుకే ఇలా ఆడుతున్నారా? - పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ల కాంట్రాక్ట్ లిస్ట్

Pakistan Cricketers Salary : 2023 ప్రపంచకప్​లో పాకిస్థాన్ డీలా పడుతోంది. వరుస ఓటములతో సెమీస్​ రేస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఇప్పటికే వారిపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా ఆ దేశ మాజీ ప్లేయర్ వారి జీతాల విషయంలో బాంబ్ పేల్చాడు.

Pakistan Cricketers Salary
Pakistan Cricketers Salary

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 3:43 PM IST

Updated : Oct 28, 2023, 4:10 PM IST

Pakistan Cricketers Salary :2023 ప్రపంచకప్​లో దాయాది పాకిస్థాన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన పాక్​... కేవలం 2 విజయాలు నమోదు చేసి.. 4 మ్యాచ్​ల్లో ఓటమి చవిచూసింది. దీంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైనట్లే. దీంతో పాకిస్థాన్ ప్లేయర్లు.. వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతున్నారు.

అయితే ప్రస్తుతం దాయాది జట్టు అనేక విమర్శలు ఎదుర్కుంటున్న సమయంలో.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలగా ప్లేయర్లకు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీతాలు చెల్లించట్లేదని ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ఆరోపించారు. అలాగే వారికి బోర్డు నుంచి ఎలాంటి మద్దతు కూడా లభించడం లేదని అన్నారు. 'పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్.. బుధవారం నుంచి బోర్డు ఛైర్మన్​ జాకా అష్రఫ్​కు ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఉస్మాన్ వాల్హ కూడా బాబర్​కు స్పందించడం లేదు' అని లతీఫ్ అన్నారు.

అయితే పాక్ క్రికెట్ బోర్డు ఇటీవల ఆటగాళ్లతో కొత్త కాంట్రక్ట్​ కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్​ ప్రకారం ప్లేయర్లు భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్నారని అప్పట్లో బోర్డు తెలిపింది. మొత్తం 25 మంది ఆటగాళ్లను ఈ కాంట్రాక్ట్​లో చేర్చింది. వారిని A, B, C, D అని 4 కేటగిరీలుగా విభజించింది.

ఆ నూతన కాంట్రక్ట్ ప్రకారం ఆటగాళ్లకు అందాల్సిన మొత్తం. (ప్రతి నెలకు)

  • A కేటగిరీ 15,900​ డాలర్లు
  • B కేటగిరీ 10,600​ డాలర్లు
  • C D కేటగిరీ 2650 - 5300 డాలర్లు
  1. A కేటగిరీ ప్లేయర్లు.. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిదీ
  2. B కేటగిరీ ప్లేయర్లు.. ఫకర్ జమాన్, హారిస్ రౌఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, సజీమ్ షా, షాదాబ్ ఖాన్.
  3. C కేటగిరీ ప్లేయర్లు.. ఇమాద్ వసీమ్, అబ్దుల్లా షఫిక్
  4. D కేటగిరీ ప్లేయర్లు.. ఫహిమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇన్షానుల్లా, మహ్మద్ హారిస్, మహ్మద్ వసీమ్, సైమ్ ఆయుబ్, సల్మాన్ అలీ అఘ్రా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షహన్వాజ్ దహాని, షాన్ మసూద్, ఉస్మాన్ మిర్, జమాన్ ఖాన్.

ODI World Cup 2023 : పాకిస్థాన్ కొంపముంచిన 'అంపైర్స్ కాల్'!.. ఇప్పుడంతా దీని గురించే పెద్ద రచ్చ

Special Security To Babar Azam : పాక్ కెప్టెన్​ బాబర్​కు బంగాల్​లో స్పెషల్​ సెక్యురిటీ.. ఎందుకో తెలుసా?

Last Updated : Oct 28, 2023, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details