Pakistan Cricket Team New Appointments : 2023 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ.. జట్టు కెప్టెన్ సహా, బోర్డులో పలు కీలక వ్యక్తులు ఆయా పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్.. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్లనుంది. ఈ క్రమంలో పర్యటనకు ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పలు నియామకాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇదివరకే టీ20, టెస్టులకు కొత్త కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ.. మేనేజ్మెంట్లో ఆయా బాధ్యతల్లో పలువురిని నియమించింది.
- జూనియర్ సెలక్షన్ కమిటీ.. పాకిస్థాన్ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్ సోహైల్ తన్వీర్‌ను బోర్డు నియమించింది. ఈ సెలక్షన్ కమిటీ పాకిస్థాన్ అండర్ 19 జట్టు సభ్యులను ఎంపిక చేస్తుంది.
- చీఫ్ సెలెక్టర్.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజామామ్ ఉల్ హక్ రీసెంట్గా చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే పీసీబీ తాజాగా ఈ బాధ్యతలను మాజీ బౌలర్ వహబ్ రియాజ్‌కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు అప్పగించింది. కాగా, 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రియాజ్.. 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలలో కలిపి .. 237 వికెట్లు తీశాడు.
- డైరెక్టర్ అండ్ హెడ్ కోచ్.. పాకిస్థాన్ పురుషుల జట్టు డైరెక్టర్, జట్టు హెడ్ కోచ్‌గా.. మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌ను పీసీబీ నియమించింది. హఫీజ్ ఇదివరకు బీసీబీ టెక్నకల్ కమిటీలో మెంబర్‌గా ఉన్నాడు. ఇక పాకిస్థాన్ తరపున హఫీజ్.. 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలలో కలిపి 12780 పరుగులు చేసి, 253 వికెట్ల పడగొట్టాడు.
- టీ20 కెప్టెన్.. పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిదీని పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా బోర్డు నియమించింది.
- టెస్టు కెప్టెన్..బ్యాటర్ షాన్ మసూద్ పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
Pakistan Tour Of Australia : పాకిస్థాన్ బోర్డు జట్టు వన్డే కెప్టెన్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. డిసెంబర్లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్.. ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.