తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 Worldcup: 'భారత్​పై పాకిస్థాన్ గెలిచి తీరుతుంది' - భారత్-పాకిస్థాన్ వాహబ్ రియాజ్

త్వరలోనే టీ20 ప్రపంచకప్(T20 World Cup)t20​ జరగనుంది. ఈ మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో ఆడనుంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో భారత్​పై పాక్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు ఆ జట్టు సీనియర్ పేసర్.

T20 Worldcu
టీ20 ప్రపంచకప్

By

Published : Aug 27, 2021, 3:49 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 world cup 2021) కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం భారత్-పాకిస్థాన్ (Ind-Pak match) పోరు. ఇరుదేశాల మధ్య నెలకొన్న సందిగ్ధ వాతావరణం కారణంగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్​ల్లో పాల్గొనట్లేదు. కేవలం మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతున్నారు. అందుకే ఈ మ్యాచ్​కు అంత ప్రత్యేకత. అయితే ఈసారి జరగబోయే టీ20 ప్రపంచకప్ పోరులో భారత్​పై పాకిస్థాన్ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పాడు ఆ దేశ పేసర్ వాహబ్ రియాజ్(wahab riaz wife).

"పాక్​ జట్టు భారత్​పై గెలవగలదు. వారి సత్తా మేరకు ఆడితే భారత్​తో పాటు ప్రపంచంలోని ఏ జట్టుపై అయినా పాక్​ విజయం సాధించగలదు. టీ20 ఫార్మాట్​లో విజయం అనేది కొద్ది బంతుల వ్యవధిలో మారిపోతూ ఉంటుంది. ఎవరు మెరుగ్గా ఆడితే వారు గెలుస్తారు. మ్యాచ్​లో పాక్ సరిగా ఆడితే భారత్​పై వారిదే విజయం. యూఏఈలోని పిచ్ పరిస్థితులు కూడా పాక్​కు అనుకూలంగా ఉంటాయి. బాబర్ అజార్ సారథ్యంలోని ప్రస్తుత జట్టుకు టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది."

-వాహబ్ రియాజ్, పాక్ పేసర్

గత టీ20 ప్రపంచకప్​లో సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది పాకిస్థాన్. దారుణ ప్రదర్శనలో గ్రూప్​ 2లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి భారత్, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్​తో కలిసి గ్రూప్​-2లో ఉంది. భారత్-పాక్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్​ అక్టోబర్ 24న జరగనుంది.

ఇవీ చూడండి: రూట్​ సెంచరీలు​- బిగ్​బీ ట్వీట్​ ట్రోల్​

ABOUT THE AUTHOR

...view details