టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాజ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టుకు గాయల బెడద వేధిస్తోంది. అయితే తాజాగా ఆ జట్టుకు చెందిన మరో ప్లేయర్‌కు గాయమైంది. స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా నవాజ్ కొట్టిన బలమైన షాట్‌కు బంతి నేరుగా వెళ్లి మసూద్ వెనుక భాగంలో తగిలింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పుకూలిపోయాడు. కొద్ది సేపు కదలకుండా అలానే ఉండిపోయాడని తెలిసింది. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడట. దీంతో అతడికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందజేశారు. ఇక కాసేపటికి మసూద్ తేరుకున్నాక అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం అతడి తలకి స్కానింగ్ చేసినట్లు సమాచారం. రిపోర్టులు ఆధారంగా అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడతాదా లేదా అని తెలుస్తుంది. అయితే బంతి మసూద్ తలకు తగిలిన వెంటనే.. ఆ షాట్ ఆడిన నవాజ్ ఉన్న చోటే మోకాళ్లపై కూర్చోని చాలా బాధపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. మసూద్‌కు ఏం కాకూడదని ప్రార్థిస్తున్నారు.