తెలంగాణ

telangana

ETV Bharat / sports

NZ vs PAK T20: పాక్​ ఖాతాలో రెండో విజయం.. కివీస్ చిత్తు - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పాకిస్థాన్. 135 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

PAK vs NZ
పాకిస్థాన్, న్యూజిలాండ్

By

Published : Oct 26, 2021, 11:01 PM IST

Updated : Oct 27, 2021, 6:43 AM IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో టీమ్​ఇండియాను ఓడించిన పాక్.. నేడు షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది.
మహ్మద్‌ రిజ్వాన్‌ (33; 34 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. పది ఓవర్ల తర్వాత కివీస్ బౌలర్లు పుంజుకుని పాక్‌ బ్యాటర్లని కట్టడి చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. చివర్లో ఆసిఫ్‌ అలీ (27; 12 బంతుల్లో 3 సిక్స్‌లు, 1 ఫోర్‌), షోయబ్ మాలిక్ (26; 20 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) ధాటిగా ఆడి పాక్‌ని విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోధీ రెండు, శాంటర్న్, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిచెల్‌ (27; 20 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), కాన్వే (27; 24 బంతుల్లో 3 ఫోర్లు), కేన్ విలియమ్సన్‌ (25; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలో చేయివేయడం వల్ల పాక్‌ ముందు ఆ మాత్రం లక్ష్యానైనా ఉంచగలిగింది. పాక్‌ బౌలర్లలో రవూఫ్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. హాఫీజ్‌, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు.

Last Updated : Oct 27, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details