PAK vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది మొత్తం 18 టీ20 మ్యాచ్‌లు గెలుపొంది.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇంతకుముందు 2018లో (ఒక క్యాలెండర్ ఇయర్‌లో) అత్యధికంగా 17 టీ20లు గెలుపొందిన ఆ జట్టు ఇప్పుడు దాన్ని తిరగరాసింది. దీంతో తన రికార్డును తానే బ్రేక్ చేసింది.
PAK vs WI: రికార్డు తిరగరాసిన పాక్.. టీ20ల్లో తొలి జట్టుగా!
PAK vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడేళ్ల క్రితం ఆ జట్టు నెలకొల్పిన రికార్డును తానే తిరగరాసింది.
కరాచి వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రిజ్వాన్ (78; 52 బంతుల్లో 10x4), హైదర్ అలీ (68; 39 బంతుల్లో 6x4, 4x6) అర్ధశతకాలతో చెలరేగారు. చివర్లో నవాజ్ (30; 10 బంతుల్లో 3x4, 2x6) మరింత ధాటిగా ఆడి జట్టుకు తిరుగులేని స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 19 ఓవర్లకు 137 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ షాయ్‌హోప్ (31; 26 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా బంతులేసి విండీస్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు.