Aus-Pak Second Test: ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 505 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.
రెండో టెస్టు మొదటి రోజు టాస్ నెగ్గి ఆసీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 189 ఓవర్లు ఆడిన ఆస్టేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 556 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో Khawaja(160), స్టీవెన్ స్మిత్(72), అలెక్స్ కారే(93) రాణించారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ జట్టు తడబడింది. 53 ఓవర్లు ఆడి 148 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా, స్వెప్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రీన్, కమిన్స్, లయన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
408 పరుగుల ఆధిక్యంతో ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 22.3 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా 505 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు అద్భుతంగా ఆడింది. 171.4 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులు చేసి మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. కెప్టెన్ బాబర్ ఆజామ్(196), మహమ్మద్ రిజ్వాన్(104),అబ్దుల్లా షఫీక్(96)లు వీరోచితంగా పోరాడి ప్రత్యర్థి చేతులకు విజయం దక్కకుండా చేశారు.