తెలంగాణ

telangana

IND VS PAK: 'పాక్​కు బీసీసీఐ వ్యతిరేకం కాదు'

By

Published : May 1, 2022, 8:59 AM IST

IND VS PAK Series: పాకిస్థాన్​తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు ఆ దేశ బోర్డు మాజీ ఛైర్మన్​​ తాకీర్ జియా​. పాక్​-భారత్​ సిరీస్​ ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలిగే ఆలోచన ఇరు బోర్డుల అధ్యక్షులు గంగూలీ, రమీర్​ రాజాకు ఉందని అన్నారు.

IND VS PAK Series
IND VS PAK Series

IND VS PAK Series: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పీసీబీ మాజీ ఛైర్మన్​ తాకీర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్​తో ఆడేందుకు బీసీసీఐ ఎప్పుడూ తిరస్కరించలేదని చెప్పారు.

"మాతో ఆడేందుకు బీసీసీఐ ఎప్పుడూ తిరస్కరించలేదు. సమస్య.. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉంది. రెండు క్రికెట్ బోర్డులు.. పాకిస్థాన్-భారత్ మ్యాచ్‌ల ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలిగే మాజీ క్రికెటర్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గంగూలీ, రమీజ్​ రాజా.. ఇద్దరూ క్రికెట్​ను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటీని చూడటం కంటే గొప్పది మరొకటి లేదు" అని పీసీబీ మాజీ ఛైర్మన్​ తాకీర్​ అన్నారు.

కాగా, ఇటీవలే.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, భారత్‌, పాకిస్థాన్‌లతో ఏటా నాలుగు దేశాల టీ20 టోర్నమెంట్‌ నిర్వహించాలన్న పాక్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా ప్రతిపాదనకు ఐసీసీ బోర్డు సమావేశంలో తిరస్కారం ఎదురైంది. దీంతో రమీజ్​ రాజా తన ఛైర్మన్​ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి! ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాకీర్​ భారత్​-పాక్​ సిరీస్​ గురించి ఈ వ్యాఖ్యలు చేశాలు.

ఇక పాక్​-భారత్​ సిరీస్​ విషయానికొస్తే.. 2004లో సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా చారిత్రక పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లొచ్చింది. అప్పుడు భారత్‌ 2-1తో టెస్టు సిరీస్‌, 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన దాయాది జట్టు 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందగా టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది. చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్‌లు జరగ్గా.. పొట్టి సిరీస్‌ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌ 2-1 పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు.

ఇదీ చూడండి: 4 దేశాల టోర్నీకి నో.. ఇక భారత్​-పాక్​ మ్యాచ్​​ లేనట్టేనా?

ABOUT THE AUTHOR

...view details