టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాడు. ఇతడితో పాటు దీపక్ చాహర్, సిద్ధార్థ్ కౌల్, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సారథి కోహ్లీ, పుజారా, రహానె, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, ధావన్, కోచ్ రవిశాస్త్రి కూడా టీకాను స్వీకరించారు.
బుమ్రా, మంధానకు కరోనా టీకా తొలి డోసు - క్రికెటర్లు కరోనా టీకా
ఇప్పటికే పలువురు టీమ్ఇండియా ఆటగాళ్లు కరోనా టీకా తొలి డోసు తీసుకోగా.. ఇప్పుడా జాబితాలో పేసర్ బుమ్రా, దీపక్ చాహర్, సిద్ధార్థ్ కౌల్, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా చేరారు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని వీరు కోరారు.
![బుమ్రా, మంధానకు కరోనా టీకా తొలి డోసు Bumrah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11721589-119-11721589-1620740673135.jpg)
బుమ్రా
టీమ్ఇండియా త్వరలోనే రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల వెల్లడించారు. కానీ, రెండో డోస్‌పై సందిగ్ధం నెలకొంది.
ఇదీ చూడండి: కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్న కోహ్లీ
Last Updated : May 11, 2021, 7:18 PM IST