టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని విషయంలో ఇతర యువ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్ వల్ల టీమ్ ఇండియా యువ ఆటగాళ్ల స్థానాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
సఫారీల సిరీస్‌లో తొలి వన్డేలో నిదానంగా ఆడి.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్.. రెండో మ్యాచ్‌లో తన దూకుడు ఏంటో చూపించాడు. భారీ షాట్లతో పాత ఇషాన్ కిషన్‌ను చూపించాడని... సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోకియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదడం తనను బాగా ఆకట్టుకుందని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
"ఇషాన్‌తో నేను ఐపీఎల్లో ఆడాను. అప్పుడు చాలా చిన్నవాడు. మేమంతా జస్టిన్ బీబర్ అని పిలిచేవాళ్లం. ఇషాన్ రోజురోజుకూ వృద్ధి చెందడం చూస్తూనే ఉన్నా. కాస్త పొట్టిగా ఉండే ఇషాన్.. అద్భుతమైన షాట్లు కొట్టగలడు. నోకియా బౌలింగ్‌లో మంచి టైమింగ్‌తో.. తన మజిల్ పవర్‌ను ఉపయోగించి సిక్స్‌లు బాదాడు. ఇషాన్ స్థాయిలోనే ఉన్న రిషభ్ పంత్, ఇతర ఆటగాళ్లు అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారి సీటుకే ఎసరు తేగలడు"
- డేల్ స్టెయిన్