Riyan Parag : రియాన్ పరాగ్ భారత టీ20 లీగ్‌లో గత నాలుగేళ్లుగా రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. మొదటి రెండు సీజన్లలో దూకుడుగా ఆడి మంచి హిట్టర్‌గా గుర్తింపు సంపాందించుకున్నాడు. అయితే, గత చివరి రెండు సీజన్లలో అతడు ఆశించినమేరకు రాణించలేదు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే పరాగ్ 2022 సీజన్‌లో 18 మ్యాచ్‌ల్లో 138.64 స్ట్రైక్‌రేట్‌తో 183 పరుగులు చేశాడు. అయినా, అతడిపై రాజస్థాన్ నమ్మకం ఉంచి వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చివర్లో బ్యాటింగ్‌కు దిగి.. వచ్చిరాగానే దూకుడు ఆడటం గురించి మాట్లాడాడు 21 ఏళ్ల రియాన్ పరాగ్.
'ఆ స్థానంలో ధోనీ ఒక్కడే నంబర్ వన్' - Riyan Parag rajastan royals
టీమ్ ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ తాజాగా ధోనీపై కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ స్థానంలో అతడు ఒక్కడే నంబర్ వన్ అంటూ కొనియాడాడు. ఇంతకీ ఆ స్థానం ఏంటంటే..
'టీ20 క్రికెట్‌లో క్రీజులోకి వచ్చిరాగానే దూకుడుగా ఆడటం కష్టతరమైన పని. ఈ ఫార్మాట్‌లో బ్యాటింగ్ చేయడానికి ఆరు, ఏడు స్థానాలు చాలా కఠినమైనవి. కొంతమంది మాత్రమే ఈ స్థానాల్లో వచ్చి దూకుడుగా ఆడగలరు. నేనైతే కేవలం ఎం.ఎస్. ధోనీ మాత్రమే ఇందులో ప్రావీణ్యం సంపాదించాడని చెప్తాను. నా కెరీర్ ఆరంభ దశలోనే ఈ పాత్రని పోషిస్తున్నా. నేనింకా దీంట్లో ప్రావీణ్యం సంపాదించలేదు.. ఇప్పుడే నేర్చుకుంటున్నా. ప్రజలు వారికి ఇష్టం వచ్చింది మాట్లాడుతారు. కానీ, ఇదెంత కఠినమైన పాత్రో నాకు తెలుసు. నా టీమ్ నన్ను నమ్ముతోంది. గత నాలుగేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తోంది. నాకిది ఐదో సంవత్సరం. జట్టు నాపై ఉంచిన నమ్మకానికి నా ఆటతీరుతో ప్రతిఫలం ఇస్తా' అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.