మహిళల ప్రీమియర్ లీగ్‌లో తొలి సీజన్లో లీగ్ మ్యాచులు ముగిశాయి. దిల్లీ క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో రెండు జట్లు ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు ఫ్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టు ఫైనల్లో దిల్లీ టీమ్‌తో తలపడనుంది. కానీ ఈ తొలి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఘోర పరభవాన్ని మూటగట్టుకుంది. ఎనిమిది లీగ్ మ్యాచుల్లో కేవలం రెండే గెలిచి ఇంటి బాట పట్టింది.
అయితే ఈ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ స్మృతినే. దీంతో ఒక్కసారి స్మృతిని నెట్టింట లక్కీ గర్ల్ అంటూ కామెంట్లు పెట్టారు. టోర్నీకి ముందు స్మృతిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆర్సీబీ అభిమానులు. కానీ స్మృతి మాత్రం.. డబ్ల్యూపీఎల్‌లో పూర్తిగా నిరాశపరించింది. ఒక్క మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ కాదు కదా.. 40 పరుగులు కూడా సాధించలేదు. ఎక్కడా తన మార్క్ చూపించలేదు. అటూ బ్యాటర్‌గానే కాకుండా.. కెప్టెన్‌గా విఫలమైంది. కేవలం రెండు మ్యాచుల్లోనే ఆర్సీబీని గెలిపించింది. ఆమె మొత్తం ఎనిమిది మ్యాచుల్లో 18.62 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఆమె స్కోర్లను చూసుకుంటే 35, 23, 18, 4, 8, 0, 37, 24.