మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్(sachin retirement day) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సోమవారానికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు పూర్తయింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన 200వ టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్లకు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో మాస్టర్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.
తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు(sachin retirement speech). ఈ క్రమంలోనే చేసిన అతడి ప్రసంగం క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ అలానే నిలిచిపోతుంది.
"సమయం చాలా త్వరగా గడిచింది. కానీ, మీరు నాకు ఇచ్చిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. ముఖ్యంగా 'సచిన్ సచిన్' అని మీరు అరిచే అరుపులు నా శ్వాస ఆగేవరకు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి" అని సచిన్ భావోద్వేగంతో చెప్పాడు.
అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్