Olympics 2028 Cricket: 2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ తగిలింది. క్రికెట్ సహా బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆధునిక పెంటాథ్లాన్ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు కోల్పోయాయి.
అభిమానులకు నిరాశ.. ఆ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లేదు - లాస్ ఏంజెలిస్ క్రికెట్ చోటు లేదు
Olympics 2028 Cricket: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. క్రికెట్ సహా బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆధునిక పెంటాథ్లాన్ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు కోల్పోయాయి.
los angeles olympics
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా ఐసీసీ ఈ ఆగస్టు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ క్రీడ ప్రాచుర్యం, యువతలో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఐవోసీ క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. 1900 పారిస్ క్రీడల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన క్రికెట్.. 2028 ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.