ఇంగ్లాండ్ యువ బౌలర్ ఒల్లీ రాబిన్సన్ (Ollie Robinson)ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది విధించింది ఈసీబీ. ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బోర్డు. ఈ కారణంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండు టెస్టుకు ఇతడు అందుబాటులో ఉండడని స్పష్టం చేశారు అధికారులు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ సస్పెండ్ - రాబిన్సన్ వివక్ష ట్వీట్లు
ఇంగ్లాండ్ బౌలర్ ఒల్లీ రాబిన్సన్(Ollie Robinson)ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ఈసీబీ. 2012-13లో స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలు పెట్టడమే ఇందుకు కారణం.ొ
![అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ సస్పెండ్ Robinson](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12043476-186-12043476-1623039735142.jpg)
రాబిన్సన్
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లతో సత్తాచాటాడు రాబిన్సన్. మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు కూడా చేశాడు. ఇదే ఇతడికి టెస్టుల్లో మొదటి మ్యాచ్ కావడం గమనార్హం.