తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​ సిరీస్​లో ఫన్నీ సీన్​​.. ఏం బాబు కొత్త స్టైలా?

Ollie Robinson Ashes : ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​లో మరో ఫన్నీ సన్నివేశం కనిపించింది. ఇంగ్లాండ్​​పేసర్​ ఒల్లీ రాబిన్​సన్​ చేసిన పనికి అతడిపై జోక్స్​ వేస్తూ తెగ ట్రోల్స్​ చేస్తున్నారు క్రికెట్​ లవర్స్​.

Ollie Robinson Ashes Shoes
కాలికో షూ వేసిన క్రికెటర్​​.. తప్పేముందంటూ ఫ్యాన్స్ ట్రోల్స్​​..!

By

Published : Jun 20, 2023, 3:35 PM IST

Ollie Robinson Ashes : ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బస్టన్​ మైదానం వేదికగా జూన్​ 16న ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​లో మరో వింత సన్నివేశం కనిపించింది. అదేంటంటే.. ఇంగ్లాండ్​ జట్టులో మధ్య ఓవర్లలో బౌలింగ్​ వేసేందుకు వచ్చిన ప్రధాన పేసర్​ ఒల్లీ రాబిన్​సన్​ కాలికి డిఫరెంట్​ షూస్​తో కనిపించాడు. కుడి కాలికి ఓ బ్రాండ్​ షూ, ఎడమ కాలికి ఇంకో బ్రాండ్​ షూ వేసుకుని మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది గమనించిన నెటిజన్లు.. 'నీ యాటిట్యూడ్​ తర్వాత ముందు షూస్​ సరిగ్గా వేసుకో గురూ..' అంటూ జోక్స్​ వేసుకుంటూ పాయింట్ ఔట్​​ చేస్తున్నారు. ఇంకొంతమంది 'తప్పేముంది.. బహుశా రెండు షూ కంపెనీలకు ప్రచారం చేస్తున్నాడేమో.. అందుకే ప్రమోషన్​ కోసం ఇలా చేశాడేమో' అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. అలా ఆసక్తిగా సాగిపోతున్న మ్యాచ్​లో రాబిన్​ చేసిన ఈ పనికి స్టేడియంలో ఉన్నవారందరూ కూడా కాసేపు నవ్వుకున్నారు.

ఒల్లీ రాబిన్​సన్ రెండు కాళ్లకు రెండు డిఫరెంట్​ షూస్

కాలి గాయమేమో..!
Robinson County Injury : అయితే ఇలా రాబిన్సన్​ కాలికో షూస్​ ధరించడం వెనుక ఓ బలమైన కారణం ఉందని కొందరు ఫ్యాన్స్​ అంటున్నారు. ఎందుకంటే యాషెస్​ సిరీస్​లోకి రాకముందు రాబిన్సన్​ కౌంటీ క్రికెట్​లో ఆడాడు. ఈ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాబిన్సన్​ కాలికి గాయమైంది. దీంతో కొద్దిరోజులు ఎడమ కాలి మడమ దగ్గర నొప్పితో బాధపడ్డాడు. క్రమంగా ఆ గాయం నుంచి కోలుకొని యాషెస్​ సిరీస్​లోకి దిగాడు. ఈ క్రమంలో అతనికి ఇంకా నొప్పి తగ్గకపోవడంతో ఇలా రెండు రకాల షూస్ వేసుకొని వచ్చాడని కొందరు అంటున్నారు.

కోపంగా సెండాఫ్​..!
Robinson Send Off Khawaja : ఇదిలా ఉంటే ఈ టెస్ట్​ సిరీస్​లోనే మరో అంశం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అదే ఆసీస్​ క్రికెటర్​ ఉస్మాన్​ ఖవాజాకు ఒల్లీ రాబిన్​సన్​ వినూత్న రీతిలో సెండాఫ్​ ఇవ్వటం. ఈ మ్యాచ్​లో శతకం బాది మంచి ఊపు మీదున్న ఖావాజాను క్లీన్​ బౌల్డ్​ చేశాడు రాబిన్​. ఈ క్రమంలో ఖావాజా పెవిలియన్​కు తిరిగి వెళ్తున్న క్రమంలో రాబిన్​ అతడివైపు కోపంతో చూస్తూ పెద్దగా అరిచాడు. దీంతో రాబిన్​ కాస్త హద్దులు మీరి ప్రవర్తించాడంటూ కొందరు నెటిజన్​లు అభిప్రాయపడ్డారు. ఇది మరవకముందే రాబిన్ సన్​ ఇలా కాలికో షూ వేసుకురావడంతో మళ్లీ ట్రెండింగ్​లోకి వచ్చాడు.

Ashes Series 2023 : ఇక మ్యాచ్​ విషయానికొస్తే 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సరికి 107/3 స్కోర్​తో నిలిచింది. ఇక ఈ సిరీస్​లో విజయం సాధించడానికి ఇంగ్లాండ్​కు ఏడు వికెట్లు అవసరం ఏర్పడగా.. ఆసీస్​ జట్టు మరో 174 పరుగులు చేయాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details