తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ట్వీట్లు చేసినందుకు సిగ్గుపడుతున్నా!'

ఇంగ్లాండ్​ పేసర్​ ఓలీ రాబిన్​సన్​ గతంలో తాను చేసిన చేసిన ట్వీట్లకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. అతడు పోస్ట్​ చేసిన స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు వైరల్​గా మారడంపై.. న్యూజిలాండ్​తో జరుగుతోన్న మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుపై తాను సిగ్గుపడుతున్నట్లు తెలిపాడు.

Ollie Robinson apologises for posting 'racist and sexist' comments
'ఆ ట్వీట్లు చేసినందుకు సిగ్గుపడుతున్నా!'

By

Published : Jun 4, 2021, 9:02 AM IST

న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ తరఫున అరంగేట్రం చేసిన పేసర్​ ఓలీ రాబిన్​సన్​ గతంలో తాను చేసిన ట్వీట్లకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ 27 ఏళ్ల పేసర్​.. 2012 నుంచి 2014 మధ్యలో ట్విట్టర్లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు. తొలిరోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన అతను మైదానంలో ఉండగా.. ఆ ట్వీట్లు సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. మ్యాచ్​ అనంతరం ఓలీ రాబిన్​సన్​ వాటిపై స్పందించాడు.

"అలాంటి ట్వీట్లు చేసినందుకు తీవ్రమైన బాధ కలుగుతోంది. నా చర్యల పట్ల సిగ్గు పడుతున్నా. అప్పుడు అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించా. నా మానసిక స్థితి అప్పుడు సరిగా లేదు. నేను చేసిన పని క్షమించరానిది. అయినా మన్నించాలని అందరినీ కోరుతున్నా. ఇంగ్లాండ్​ తరఫున టెస్టు అరంగేట్రం చేశాననే గర్వం, మైదానంలో రాణించిన సంతోషంతో ఇప్పుడు నేనుండాల్సింది. కానీ గతంలో నా ప్రవర్తన ఓ కళంకంగా మారింది. గత కొన్నేళ్లుగా నా జీవితాన్ని ఉత్తమంగా మలుచుకునేందుకు శ్రమించా. కాస్త పరిణతి చెందా. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన దాని కారణంగా ఇప్పుడు నా జట్టు సహచరుల, ఇంగ్లాండ్​ బోర్డ్​ ప్రయత్నాలపై ప్రభావం పడడం నాకిష్టం లేదు."

- ఓలీ రాబిన్​సన్​, ఇంగ్లాండ్​ బౌలర్​

టీనేజర్​గా ఉన్న తనపై ఇంగ్లాండ్​ కౌంటీ జట్టు యార్క్​షైర్​ వేటు వేయడం వల్ల కఠిన పరిస్థితులు గడిపిన తాను ఆ విధంగా ట్వీట్లు చేసినట్లు రాబిన్​సన్​ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:Saklain Mustak: ఓపెనర్లలో సెహ్వాగ్​దే ఆధిపత్యం​

ABOUT THE AUTHOR

...view details