తెలంగాణ

telangana

ODI World cup 2023 Team India : టీమ్​ఇండియా ఈ 10మంది ప్లేయర్స్​ నో డౌట్​.. అతనొక్కడే మైనస్​!

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:53 AM IST

Updated : Oct 19, 2023, 9:19 AM IST

ODI World cup 2023 Team India : ప్రపంచ కప్​ 2023లో ఆడుతున్న టీమ్​ఇండియాలో పది మంది ప్లేయర్ల అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ ఆ ఒక్కడు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

ODI World cup 2023 Team India : టీమ్​ఇండియా ఈ 10మంది ప్లేయర్స్​ నో డౌట్​.. అతనొక్కడే మైనస్​!
ODI World cup 2023 Team India : టీమ్​ఇండియా ఈ 10మంది ప్లేయర్స్​ నో డౌట్​.. అతనొక్కడే మైనస్​!

ODI World cup 2023 Team India : ప్రపంచకప్​ 2023లో భారత్​ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ప్లాయింట్​ పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఓపెనర్​గా ఉన్న రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. కోహ్లీ, రాహుల్​ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో సత్తా చాటారు. అప్గానిస్థాన్​, పాకిస్థాన్​తో తలపడిన మ్యాచ్​లో శ్రేయస్​ అయ్యర్​ మంచిగా రాణించాడు. శుభ్​మన్​ గిల్ కొంత కాలంగా మంచి ఫామ్​లోనే ఉన్నాడు. ఆల్​ రౌండర్​ హార్దిక్​ బంతితో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్​లో బుమ్రా, సిరాజ్​, కుల్​దీప్, జడేజా వీళ్లందరూ ఈ ఎడిషన్​లో తమదైన ముద్ర వేశారు. మొత్తంగా జట్టులో పది స్థానాలపై ఆట తీరు విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన ఆ ఒక్క ఆటగాడిపై నమ్మకం కలగటం లేదని అంటున్నారు అభిమానులు. ఆ ఆటగాడే శార్దూల్​ ఠాకూర్.

Shardul Thakur Performance.. శార్దూల్ ఠాకూర్​పై టీమ్ మేనేజ్​మెంట్​ నమ్మకం పెట్టుకుని మరీ తుది జట్టులో అవకాశం కల్పించింది. వన్డేల్లో అతడి ఆట ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. కొంత కాలంగా అంతంత మాత్రంగానే ఫామ్​లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 46 వన్డేల్లో 30.54 సగటు రేటుతో 64 వికెట్లు తీశాడు. ప్రస్తుత ప్రపంచకప్​లో ఆడిన రెండు మ్యాచ్​ల్లో 8 ఓవర్లల్లో 43 పరుగులిల్చి.. ఒక్క వికెట్​ మాత్రమే తీశాడు. లోయరార్డర్లో బ్యాటింగ్‌కు ఉపయోగపడతాడన్న కారణంతో శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా శార్దూల్ బౌలర్​.. కానీ, బౌలింగ్​లోనూ పెద్దగా రాణిస్తున్నది లేదు. హార్దిక్​తో ఎక్కువ ఓవర్లు వేయిస్తూ.. శార్దుల్​కు కెప్టెన్​ పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవటం కనిపిస్తోంది. ఒకవేళా అతనికి అవకాశం ఇస్తే ఎక్కువ పరుగులు ఇచ్చేస్తాడనే భయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. చెన్నైలో పిచ్​​ స్పిన్​కు అనుకూలమని మూడో స్పిన్నర్​గా అశ్విన్​ను ఎంచుకున్నారు. కానీ, టీమ్​ మేనేజ్​మెంట్​తరవాత రెండు మ్యాచ్​లకు అతని తప్పించి శార్దూల్​ను తీసుకుంది. ఇలా తీసుకోవటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమి లేదునే విమర్శలు వస్తున్నాయి.
ఒకవేళా స్పిన్నర్​ బదులు పేసరే తీసుకోవాలనుకుంటే.. ప్రత్యామ్నాయంగా షమి ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షమి మంచి వేగంతో పది ఓవర్లు బౌలింగ్‌ చేయగలడు. తరచుగా వికెట్లు కూడా పడగొట్టగలడు. అలాంటి బౌలర్‌ను పక్కన పెట్టి శార్దూల్‌కే ఎందుకు ఎక్కువ అవకాశాలిస్తున్నారన్నది అర్థం కాని విషయం. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా జట్టు యాజమాన్యం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాదేమో చూడాలి.

Last Updated : Oct 19, 2023, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details