ODI World Cup 2023 South Africa vs Australia : వన్డే ప్రపంచ కప్ - 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలోనే ఆలౌటైంది. 177 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు ఏకంగా 134 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా, వరల్డ్ కప్ టైటిల్ ఫెవరెట్ ఆస్ట్రేలియాకు ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో ఓటమి. మొదట టీమ్ఇండియా చేతుల్లో 199 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 134 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
లక్ష్యఛేదనలో ఆసీస్ మొదటి ఓవర్లు నిలకడగానే ఆడింది. కానీ ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోయింది. 15 బంతుల్లో 7 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔట్ అవ్వగా... 27 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 16 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్... రబాడా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన జోష్.. రబాడా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అవ్వగా... 17 బంతులు ఆడి 3 పరుగులు మాత్రమే చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.