తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup 2023 : సెమీస్​ రేస్​.. రెండు జట్ల లెక్క తేలిపోయింది! - వన్డే వరల్డ్​ కప్ 2023 పాయింట్ల టేబుల్

ODI World Cup 2023 Semifinal : ఆదివారం జరిగిన టీమ్​ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్‌తో వరల్డ్​ కప్​లో రెండు జట్ల లెక్క తేలిపోయింది. ఆ వివరాలు..

ODI World Cup 2023 : సెమీస్​ రేస్​..  రెండు జట్ల లెక్క తేలిపోయింది!
ODI World Cup 2023 : సెమీస్​ రేస్​.. రెండు జట్ల లెక్క తేలిపోయింది!

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 7:42 AM IST

ODI World Cup 2023 Semifinal : ఆదివారం టీమ్​ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన​ మ్యాచ్‌తో ప్రపంచ కప్‌ 2023లో రెండు జట్ల లెక్క తేలిపోయింది. అధికారికంగా చెప్పలేదన్న మాటే కానీ.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్‌ఇండియా సెమీ ఫైనల్​ అర్హత సాధించినట్లే. మరోవైపు, ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఐదింటిలో ఓడిన ఇంగ్లాండ్‌ సాంకేతికంగా మాత్రమే సెమీస్​ రేసులో ఉంది. అయితే నెట్‌ రన్‌ రేట్‌ కూడా మరీ దారుణంగా ఉంది కనుక మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ఆ జట్టుకు సెమీస్ ఛాన్స్​ ఉండకపోవచ్చు. ఈ జట్టు దాదాపుగా ఇంటికి వెళ్లిపోయినట్టే.

  • బంగ్లాదేశ్‌ కూడా 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి దాదాపుగా సెమీస్‌ రేసు నుంచి వైదొలిగింది.
  • 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచిన సౌతాఫ్రికా కూడా సెమీస్‌కు దగ్గరగా ఉంది. దాదాపుగా అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
  • ఇక ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, న్యూజిలాండ్‌ 6 మ్యాచ్‌ల్లో 4 గెలుపులను ఖాతాలో వేసుకుని.. మెరుగైన స్థితిలో ఉన్నాయి.
  • శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పాకిస్థాన్‌ 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలను దక్కించుకుని సెమీస్‌ మీద గట్టి ఆశలే పెట్టుకున్నాయి. కానీ అవి ముందుకు సాగాలంటే మిగతా మ్యాచులన్నీ గెలవాలి. అదే సమయంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ పాయింట్స్ టేబుల్​లో కిందకు పడిపోవాలి. అలా జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
  • అఫ్గానిస్థాన్‌ 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, నెదర్లాండ్స్‌ 6 మ్యాచ్‌ల్లో 2 గెలుపులను ఖాతాలో వేసుకుని సాంకేతికంగా సెమీస్‌ రేసులో ఉన్నప్పటికీ.. రాబోయే మ్యాచుల్లో సంచలన విజయాలను పునరావృతం చేయడం చిన్న విషయం కాదనే చెప్పాలి.

కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్​లో వంద పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది టీమ్​ఇండియా. కెప్టెన్‌ రోహిత్‌.. పేసర్లు షమి, బుమ్రా జట్టు విజయంలో హీరోలుగా నిలిచారు. ఈ ప్రపంచ కప్​లో మొదటి అయిదు మ్యాచ్‌ల్లోనూ ఛేదించి గెలిచిన టీమ్​ఇండియా.. తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగి గెలిచింది. 229/9.. స్కోరు చేసింది.

ABOUT THE AUTHOR

...view details