ODI World Cup 2023 Semi Final : వరల్డ్ కప్ 2023 ప్రారంభం కాకముందు.. ఈ సారి సెమీస్ చేరే జట్లే ఏం అయి ఉండొచ్చు అన్న ప్రస్తావన వస్తే.. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనే మూడు పేర్లే ఎక్కువగా వినిపిచ్చాయి. టాప్ -3లో ఈ ముగ్గురే ఉంటారని.. మరో స్థానంలో ఎవ్వరైనా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు అంచనాలు తారుమరయ్యాయి. ఒక్క భారత్ మాత్రమే అంచనాలకు తగ్గట్టుగా ఆడుతోంది. మిగతా రెండు జట్లు తుస్సు మనిపిస్తున్నాయి.
ఆ మ్యాచ్ ఆసీస్ గమనాన్ని నిర్దేశిస్తుంది.. టీమ్ ఇండియాపై ఓడిపోయిన తర్వాత, సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం వల్ల ఆసీస్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో ఓడటం వల్ల నెట్ రన్‌రేట్ బాగా డౌన్ అయిపోయింది. ఆసీస్ అట్టడుగు స్థానంలో ఉండిపోయింది. అప్పటికీ నెదర్లాండ్స్ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయినా.. దాని నెట్‌రన్‌రేటే ఎక్కువగానే ఉంది. కానీ మూడో మ్యాచ్‌లో లంకపై గెలిచినా.. ఆసీస్ ప్రదర్శన అంత సాఫీగా సాగలేదు. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆరంభంలోనే తడబాటు పడటం ఆ జట్టు సామర్థ్యంపై సందేహాలను రేకెత్తించింది. ఇక శుక్రవారం(అక్టోబర్ 20) పాకిస్థాన్‌తో చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ ఆ జట్టు గమనాన్ని నిర్దేశిస్తుంది.
ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అంతే.. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. మూడో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ లాంటి పసికూనపై దారుణంగా ఓడింది. ఈ ఓటమితో ఇకపై ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ గండంగా మారబోతుంది. ఆత్మరక్షణలో పడిపోయింది ఇంగ్లాండ్. మరి సెమీస్ రేసులో ఎలా ముందంజ వేస్తుందో?
పాకిస్థాన్ ఎలా పుంజుకుంటుందో... ఇకపోతే పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలు సాధించినా.. అవి పసికూనలపైన అందుకున్నవే. ఆ వెంటనే టీమ్ఇండియాపై దారుణంగా ఓడింది. మరి ఎలా పుంజుకుంటుందో చూడాలి.
ప్రస్తుతానికి ఈ మూడు రేసులో... ప్రస్తుతానికి సెమీస్ రేసులో టీమ్ఇండియా పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభంకాకముందు ఇప్పుడు భారత్ మరింత మెరుగైన స్థితిలో కనపడుతోంది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడంతో టీమ్ఇండియా టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా మారపోయింది.